బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు
పెన్ పహాడ్, తుంగతుర్తి, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం పెన్ పహాడ్ మండల కేంద్రంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే తిరుమలగిరి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించిన సాయుద రైతాంగ పోరాటయోధుడు పోరెల్ల దాసు స్తూపాన్ని ఆవిష్కరించారు.
ALSO READ: కాంగ్రెస్‌ది అబద్ధాల డిక్లరేషన్.. మోసపోతే గోసవడ్తం : హరీశ్‌రావు
ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. పోరాట యోధుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలకు న్యాయం జరగదని, అవినీతిపై పోరాటం చేస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
తుంగతుర్తిలో ల్యాండ్ , సాండ్ మాఫియా జోరుగా సాగుతోందని, అందులో కాంగ్రెస్ నాయకుల వాటాలు ఉన్నాయని ఆరోపించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, నేతలు పేరాల పూలమ్మ, శోభారాణి, బంగారు స్వామి, సాగర్, సోమయ్య, వెంకటేశ్వర్లు, జ్యోతి, మంజుల, ఎల్లయ్య , ఆరె ప్రభాకర్ పాల్గొన్నారు.