ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు

సూర్యాపేట, వెలుగు : కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెంలో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం అయ్యాక ఆర్టీసీ, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు భారీగా పెరిగాయన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని వ్యక్తి దేశాన్ని మారుస్తానంటూ జాతీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ఆశవర్కర్లు, ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, వీఆర్ఏలను ఇబ్బంది పెడుతున్న టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాలిపోయిన బీజేవైఎం యువమోర్చా మండల అధ్యక్షుడు బానోతు చిట్టిబాబు ఇంటిని పరిశీరించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మండల అధ్యక్షుడు లక్ష్మణరావు, నాయకులు తుక్కాని మన్మథరెడ్డి, రాచకొండ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకన్న, బిట్టు నాగరాజు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కనగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గ్రామాలకు విడుదల చేస్తున్న నిధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగానే తెలంగాణలో కూడా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ నెల 15 వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య పాల్గొన్నారు.

కార్మిక సమస్యల పరిష్కారానికి ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ కృషి

సూర్యాపేట, వెలుగు : కార్మికుల సమస్యలపై ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ పోరాటం చేస్తోందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట డీసీసీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని కార్మికులందరికీ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో హమాలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లను ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, కొండపల్లి సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రెబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బైరు శైలేంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలేటి మాణిక్యం, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

దళితుడిపై దాడి ఘటనలో డీఎస్పీ ఎంక్వైరీ

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం బాజకుంటలో దళితుడిపై సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడి ఘటనకు సంబంధించి ఆదివారం నల్గొండ డీఎస్పీ నర్సింహారెడ్డి ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేశాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ శివరామిరెడ్డి, ఎస్సై రామకృష్ణగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వినియోగించుకోవాలి

కోదాడ, వెలుగు : టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులను ఉపయోగించుకొని పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మార్కులు సాధించాలని ఏఐఎస్‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు ఏఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆదివారం టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులు, టీచర్లకు పేరు తీసుకురావాలని చెప్పారు. ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని సూచించారు. టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం స్టూడెంట్లు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం చదవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మనబోయిన నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు కడారు మధు, బాబా, బన్నీ, కావ్య, నిహారిక, రమ్య, హారిక, నాగసరిత పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు కృషి

దేవరకొండ, వెలుగు : దేవరకొండ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, హన్మంతు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముత్యాల సర్వయ్య, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్, నేతాళ్ల భాగ్యలక్ష్మి, కొండ్రు మల్లీశ్వరి, వేముల రాజు, నేనావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీను, పొన్నెబోయిన సైదులు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.

నల్గొండవాసికి జాతీయ ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మహాత్మా జ్యోతిబా పూలే జాతీయ ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు 2022కు నల్గొండకు చెందిన అలీసారి నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికయ్యారు. కరోనా టైంలో అనాథలు, వృద్ధులకు నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించిన సేవలకుగానూ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమనక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా ఆదివారం న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ తనను గుర్తించి జాతీయ అవార్డు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. దళిత సాహిత్య అకాడమీ సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యదర్శి జితేంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనుకి కృతజ్ఞతలు తెలిపారు.