- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను సక్సెస్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంల కొనసాగుతున్న యాత్ర నేడు సూర్యాపేటకు రానుంది. ఈ మేరకు మంగళవారం పర్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా నాయకులతో కలసి స్వాగత ఏర్పాట్లతో పాటు సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ..
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోని దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న మోదీని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జట్టుకొండ సత్యనారాయణ, జిల్లా నాయకులు సలిగంటి వీరేంద్ర, అబిద్
చల్లమల్ల నరసింహ, పోలగాని ధనుంజయ గౌడ్, పలస మల్సూర్ గౌడ్, సలిగంటి శ్రీను, రంగినేని లక్ష్మణరావు, ఆరూరి శివ, తోనకునూరి సంతోష్ కుమార్, మీర్ సికిందర్, కొప్పుల క్రాంతి రెడ్డి, షేక్ సలీం పాషా, బూర లక్ష్మణ్ గౌడ్, తాళ్లపల్లి మధు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.