కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే : సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: దేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, మోదీని   ప్రధానమంత్రి కాకుండా ఆపే దమ్ము దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.   సోమవారం   సూర్యాపేటలో బీజేపీ కార్యాలయంలో  నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల  సమావేశంలో మాట్లాడారు.    

మార్చి 1న  బస్సు యాత్ర సూర్యాపేటకు  చేరుకుంటుందని,  ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి,  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి వస్తారని చెప్పారు.     రాష్ట్రంలో బీజేపీకి,  కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర తదితరులు  పాల్గొన్నారు. 

ALSO READ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు