
రామచంద్రాపురం, వెలుగు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఏక్ తారీఖ్, ఏక్ గంట, ఏక్ సాత్ అనే కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడే అందరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మహిళ బసమ్మ, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేశ్ముదిరాజ్, బూత్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, నాయకులు సత్యనారాయణ, కామేశ్వరరావు, రాములు, భిక్షపతి పాల్గొన్నారు.