జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో ఎలక్షన్లు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సూరంకోట్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ముస్తాక్ అహ్మద్ షా బుఖారీ చనిపోయారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం ఉదయం ఆయన ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలారు. ముస్తాక్ అహ్మద్ షా బుఖారీకు 75 ఏళ్లు, ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ALSO READ | మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
బుఖారీ గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారని, ఉదయం కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని పార్టీ నేతలు తెలిపారు. సురన్‌కోట్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుఖారీ. కొండ ప్రాంతాలకు చెందిన ప్రజలను కేంద్రం షెడ్యూల్డ్ తెగ హోదా మంజూరు చేసిన తర్వాత 2024 ఫిబ్రవరిలో ఆయన బిజెపిలో చేరారు. సురన్ కోట్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 25 న ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రైనా బుఖారీని ఆయన్ని ప్రజల నాయకుడుగా అభివర్ణించాడు.