ఆయుష్మాన్ పథకాన్ని అడ్డుకున్న కేసీఆర్ : సంకినేని

సూర్యాపేట, వెలుగు: పేదలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని బీజేపీ సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు ఆరోపించారు.  ఆదివారం చివ్వెంల మండలం జయరామ్ తండా, పాండ్యా తండా, బీమ్ల తండా, మొగ్గయ్య గూడెం, బి చందుపట్ల  గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

అంతకుముందు పార్టీ ఆఫీసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.  సూర్యాపేట ప్రజల చిరకాల కోరిక హైదరాబాద్ , విజయవాడకు రైల్వే మార్గం  బీజేపీతోనే సాధ్యమన్నారు.  రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వస్తే  పేదలకు విద్య,  వైద్యం, రైతులకు రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియాను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.  

రాష్ట్రానికి బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ నుంచి  బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు.