
హర్యానా లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లిన్ స్వీప్ చేసింది. బుధవారం ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మొత్తం10స్థానాలకు ఎన్నికలు జరగ్గా..9స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ హుడా కంచుకోట అయిన గురుగ్రామ్,రోహ్తక్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది.
మార్చి 2న గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్ ,యమునానగర్ - ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్లు ,వార్డు సభ్యులను ఎన్నుకునే ఎన్నికలు జరిగాయి. అంబాలా ,సోనిపట్‌లలో మేయర్ పదవులకు ఉప ఎన్నికలు ,21 మునిసిపల్ కమిటీలలో అధ్యక్షులు ,వార్డు సభ్యుల ఎన్నికలు కూడా అదే రోజు జరిగాయి.
ALSO READ | మారిషస్లో ప్రధాని మోడీకి గ్రాండ్ వెల్కమ్
బుధవారం ప్రకటించిన ఈ ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ 9 మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంది. పదో స్థానం మనేసర్ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఇందర్ జిత్ యాదవ్ గెలిచారు. అంబాలా మేయర్ గా శైలజా సచ్ దేవా, గురుగ్రామ్ మేయర్ గా బీజేపీకి చెందిన రాజ్ రాణి ఎన్నికయ్యారు. సోనిపట్ లో రాజీవ్ జైన్ , కర్నాల్ లో రేణుబాలగుప్తా గెలిచారు.