‘నార్త్‘లో లోటు..నార్త్ ఈస్ట్ తో భర్తీకి బీజేపీ స్కెచ్

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసంబీజేపీ సర్వశక్తులు మోహరిస్తోంది. 2014లో బీజేపీ సొంతంగా మొత్తం 543 నియోజకవర్గా ల్లో282 సీట్లు గెలుచుకుంది. ఈ ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. కొన్ని నెలల కిందట జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ రాష్ట్రా ల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.అనేక హిందీ రాష్ట్రాల్లోబీజేపీ ఎదురీదుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్లో ఒకవేళ నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికినార్త్​ ఈస్ట్​​ రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి మొత్తం 25 లోక్ సభనియోజకవర్గాలున్నా యి. వీటిలో కనీసం 22 సెగ్మెంట్లు గెలుచుకోవడానికి పక్కా ప్రణాళిక తయారుచేసి ఆ దిశగా పావులు కదుపుతోంది. సిటిజన్ షిప్(సవరణ) బిల్లు వచ్చిన తొలి రోజుల్లో ఈశాన్య రాష్ట్రా ల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. అసాంలోనిబీజేపీ సర్కార్ నుంచి ‘అసాంగణ పరిషత్’ వంటికీలక మిత్రపక్షం వెళ్లిపోయింది. అయితే బీజేపీ హైకమాండ్ చొరవ చూపి చర్చలు జరపడంతో ఏజీపీ మళ్లీ ఎన్డీయే కూటమిలోకి వచ్చింది.

అసాం ఒక్కటేకాదు, మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో నూ సిటిజన్ షిప్ చట్టంతో ఏర్పడ్డ అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నించింది. పాత మిత్రపక్షాలను దగ్గర చేసుకునేప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. నరేంద్ర మోడీప్రధాని అయ్యాక ఈశాన్య రాష్ట్రా లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తరచు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు.ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 30 సార్లు నార్త్ ఈస్ట్రన్స్టేట్స్ లో మోడీ పర్యటించారు. ఎక్కడో విసిరేసినట్లుండే ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంతో కలపడానికి మోడీ సర్కార్ కృషి చేసింది. ఆయారాష్ట్రా ల్లో రవాణా సదుపాయాలు అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. దీని కోసం కోట్ల రూపాయలనిధులను అందచేసింది.ఇందులో భాగంగా 2017 లో ‘ నార్త్ ఈస్ట్ స్పె షల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ స్కీం ’ ను కేంద్రకే బినెట్ ఆమోదిం చింది. ఈ స్కీంకు అవసరమయ్యే నిధులన్నిటినీ కేంద్రమే అందచేసింది.

పాత మిత్రులతో మళ్లీ దోస్తానా

అసాం: మిగతా ఈశాన్య రాష్ట్రా లతో పోలిస్తే బీజేపీ కి అసాంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ నాయకత్వంలో సర్కార్ ఏర్పడింది. అసాం గణ పరిషత్వంటి కీలక రాజకీయ పార్టీ బీజేపీ సర్కార్ లో చేరింది. ఎగువ అసాంలోని ఏడు జిల్లాల్లో 850 కి పైగా టీ తోటలున్నా యి. ఈ టీ తోటల్లో లక్షలాది మంది కార్మికు లుపనిచేస్తున్నారు. అసాంలో గెలుపోటములను నిర్ణయించే సత్తా ఈ తేయాకు కార్మికులకు ఉంది. వీరి ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుం ది. రాజకీయాలకతీతంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కోసం ఏర్పాటైన ‘ నార్త్ ఈస్ట్డెమొక్రటిక్ అలయన్స్ ’ ( ఎన్ఈడీఏ ) కు కన్వీ నర్ గా ఉన్న హిమంత విశ్వ శర్మఅసాంకు చెందిన వారే. కాంగ్రెస్ రెబెల్ గా ఉన్న శర్మ 2015 లో బీజేపీలో చేరారు.అసాంలో బీజేపీ బలపడడంలో హిమంత శర్మకీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యం లో అసాంలోమెజారిటీ లోక్ సభ సీట్లు తమ ఖాతాలోనే పడతాయని బీజేపీ గట్టి ధీమాతో ఉంది. అసాంలోని మొత్తం 14నియోజకవర్గా లకు గాను ఐదు సీట్లలో గురువారం పోలింగ్ జరుగుతుంది.

అరుణాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రం లో రెండు లోక్ సభ సెగ్మెంట్లున్నా యి. ఈరెండు నియోజకవర్గా లకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది.

మణిపూర్: మోడీ ప్రధానిగా పగ్గా లు చేపట్టాక మణిపూర్ లో బీజేపీబలో పేతమైంది. 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 21 సీట్లుగెలుచుకుంది. కొంతమంది ఇండిపెండెట్లు, మణిపూర్ కే పరిమితమైన కొన్నిప్రాంతీ య పార్టీల మద్దతుతో బీజేపీ, సర్కార్ ను ఏర్పాటు చేసింది. మణిపూర్లోని ఏకైక లోక్ సభ సెగ్మెంట్ కు గురువారం పోలింగ్ జరుగుతుంది.

మేఘాలయ: ఇక్కడ కనార్డ్ సంగ్మా నాయకత్వంతో ఎన్పీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఎన్డీయే కూటమిలో ఈ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది.కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ ఎన్పీపీ కూటమిలో ఉన్నాయి.మేఘాలయలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు షిల్లాంగ్, తుర ఉన్నాయి.ఈ రెండు సెగ్మెంట్లకు ఈనెల 11న పోలిం గ్ జరుగుతుం ది.

నాగాలాండ్: 2018 లో జరిగిన ఇక్కడ జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోభాగస్వామ్యపక్షంగా ఉన్న ‘ నేషనల్ డెమొక్రటిక్ప్రోగ్రెసివ్ పార్టీ ’ (ఎన్ డీ పీపీ ) గెలిచింది. బీజేపీసాయంతో రాష్ట్రంలో సర్కార్ ను కూడా ఏర్పాటు చేసింది. మోడీ ప్రధాని అయ్యాక 2015 ఆగస్టులో నాగా ఉద్యమకారులతో కేంద్రం ఒప్పం దం కుదుర్చుకుంది.నాగాలాం డ్ లో ఉన్న ఏకైక లోక్ సభసెగ్మెంట్ కు గురువారం పోలింగ్ జరుగుతుం ది.

త్రిపుర: 2018 లో త్రిపురలో తొలిసారి బీజేపీప్రభుత్వం ఏర్పాటైంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇక్కడి ‘ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ’ (ఐపీఎఫ్ టి) తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. త్రిపురలో రెండు లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. త్రిపుర వెస్ట్ సెగ్మెంట్ కు తొలి విడతలోపోలింగ్ జరుగుతుంది.

మిజోరం: క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రం ఇది. ఇక్కడి ఏకైక లోక్ సభ సెగ్మెంట్ మిజోరంలో గురువారం పోలింగ్ జరుగుతుంది.

సిక్కిం: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద గా ఆశలు పెట్టుకోని ఏకైక రాష్ట్రం సిక్కిం. ఇక్కడ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ( ఎస్ డీ ఎఫ్ ) అధికారంలో ఉంది. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి సిక్కిం  డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతు ఇస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలో బీజేపీకి దూరంగా ఉంటోంది. ఇక్కడ ఉన్నఒకే ఒక లోక్ సభ సీటుకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది.