కిషన్ రెడ్డి అరెస్ట్..

కిషన్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్  ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. 

బీజేపీ 24 గంటల ఉపవాస దీక్షకు పోలీసులు సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం 6 అయ్యాక దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ కిషణ్ రెడ్డి సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం వరకు  దీక్ష చేస్తామనడంతో పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో  కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.