వరద సాయం ఇంటికి రూ.25 వేలు ఇస్తాం

వరద సాయం ఇంటికి రూ.25 వేలు ఇస్తాం

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ.25 వేలు ఇస్తామన్నారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఎంత నష్టం వస్తే అంత లెక్క గట్టి ఇస్తామన్నారు. నష్టపోయిన కార్లు, బైక్ లు ఇప్పిస్తామన్నారు. కేసీఆర్  చార్మినార్  వద్దకు రావాలని బండి సంజయ్ సవాల్  విసిరారు. తాను వరద సాయం ఆపానని కేసీఆర్ నిరూపించాలన్నారు. వరద సాయం ఆపలేదని తాను అమ్మవారిపై ప్రమాణం చేస్తానన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే  తన పేరుతో లేటర్ రాయించారన్నారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్సులు లేని ఖాకీలన్నారు.

సీఎం కేసీఆర్ కు  బీజేపీ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ ను చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. చాయ్ పే చర్చా కాక.. మందు పే చర్చా పెట్టమంటావా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు.  కేసీఆర్ ఫోటో పెట్టి మందు పే చర్చ పెడ్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు వైన్లు, బార్లే మిగులుతాయన్నారు. హిందు దేవాలయాలపై దాడులు కేసీఆర్ కు కనపడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్..హైదరాబాద్ ను ఎంఐఎంకు అప్పగించాలనుకుంటున్నావా? అని అన్నారు. కేసీఆర్  పక్కా దేశ ద్రోహి అన్నారు. తెలంగాణలో హిందువుల్ని బతకనివ్వవా కేసీఆర్ అనిప్రశ్నించారు. ఎవరి ఓట్ల కోసం కేసీఆర్.. దేశాన్ని తక్కు చేసి మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. దేశాన్ని తక్కువ చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  గెలవాలనుకుంటున్నావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చుంటే మేనిఫెస్టో ఎందుకు డిలీట్ చేశారన్నారు. బీజేపీ మేయర్ ను గెలిపించాలన్నారు.