
తెలంగాణలో రేపటి నుంచి (నవంబర్ 3) నామినేషన్ల ఘట్టం మొదలుకానుంది. బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. . మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించి పది మంది అభ్యర్థులను మాత్రమే ఖరారు చేసింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ సారి బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అంబర్‌పేట, మల్కాజిగిరిలలో వేరే వారికి అవకాశం కల్పించారు.
మూడో జాబితా వివరాలు
1. మంచిర్యాల : వీరబెల్లి రఘునాథ్
2. ఆసిఫాబాద్ : అజ్మీర అత్రం నాయక్
3. బోధన్ వడ్డి: మోహన్ రెడ్డి
4. బాన్స్ వాడ : లక్ష్మీనారాయణ
5. నిజామాబాద్ రూరల్: దినేష్ కులాచారి
6. మంథని : సునీల్ రెడ్డి
7. మెదక్ : విజయ్ కుమార్
8. నారాయణఖేడ్: సంగప్ప
9. ఆందోల్ (ఎస్సీ): బాబూ మోహన్
10. జహీరాబాదఖ ((ఎస్సీ): రామచంద్ర రాజా నరసింహ
11 ఉప్పల్: ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్
12 లాల్ బహదూర్ నగర్: రంగారెడ్డి
13. రాజేంద్రనగర్: శ్రీనివాసరెడ్డి
14 చేవెళ్ల ( ఎస్ సీ): రత్నం
15 పరిగి : మారుతీ కిరణ్
16 ముషీరాబాద్: పోసారాజు
17 మలక్ పేట : సురేందర్ రెడ్డి
18 అంబర్ పేట: కృష్ణయాదవ్
19 జూబ్లీ హిల్స్ :దీపక్ రెడ్డి
20 సనత్ నగర్: మర్రి శశిధర్ రెడ్డి
21 సికింద్రాబాద్ మేకల సారంగపాణి
22 నారాయణపేట: పాండు రెడ్డి
23 జడ్చెర్ల : చిత్తరంజన్ దాస్
24 మక్తల్ : జలంధర్ రెడ్డి
25 వనపర్తి: అశ్వత్తామరెడ్డి
26 అచ్చంపేట (ఎస్ సీ): సతీష్ మాదిగ
27 షాద్ నగర్: అందె బాబయ్య
28 దేవరకొండ (ఎస్ టీ): కే లాలూనాయక్
29 హుజూర్ నగర్: చల్లా శ్రీలతా రెడ్డి
30 నల్లగొండ: ఎమ్ శ్రీనివాస్ గౌడ్
31 ఆలేరు: పడల శ్రీనివాస్
32 పరకాల: డా. పి, కాలి ప్రసాదరావు
33 పినపాక: (ఎస్ టీ) పి. బాలరాజు
34 పాలేరు: నున్నా రవికుమార్
35 సత్తుపల్లి (ఎస్ సీ): రామలింగేశ్వరరావు
బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఎక్కువమంది కొత్త అభ్యర్థులకు పార్టీ అవకాశం కల్పించింది. అయితే ఆందోల్ అభ్యర్థిగా ఖరారు చేసిన బాబూమోహన్ కొద్దిరోజుల క్రితం పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. తాను ఈ సారి ఎన్నికల్లో పోటీచేయనని బాబూమోహన్ ప్రకటించారు.
ALSO READ :- ఖర్గేతో వివేక్ వెంకటస్వామి కుటుంబం భేటీ : కేసీఆర్ ను ఓడించేందుకు పని చేస్తాం