మణిపూర్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తామే గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పొత్తులు లేకుండా మొత్తం 60 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు మొత్తం 60 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇవాళ ప్రకటించింది. సీఎం ఎన్. బీరెన్ సింగ్ హైన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
BJP announces candidates for all 60 Assembly seats in Manipur, CM N Biren Singh to contest from Heingang constituency
— ANI (@ANI) January 30, 2022
(File photo) pic.twitter.com/XF0HoESeye
మళ్లీ బీజేపీదే అధికారం
ఇవాళ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మణిపూర్‌లో మరోసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు. మణిపూర్‌లో తమ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని, అన్ని స్థానాలకూ అభ్యర్థులను నిర్ణయించామని, సీఎం బీరెన్ సింగ్ హైన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేసిన వారికే మెజారిటీ సీట్లు కేటాయించామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. 60 శాతానికి పైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు.
Bharatiya Janata Party will contest on all 60 seats in the upcoming Manipur Assembly elections and form a government with more than 2/3rd majority: BJP leader and Union minister Bhupender Yadav pic.twitter.com/GK7fxmgK9C
— ANI (@ANI) January 30, 2022
కాగా, మణిపూర్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో ఓటింగ్, మార్చి 10న కౌంటింగ్ ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం..
సబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా