ఏప్రిల్ 20 నుంచి వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా క్యాంపెయిన్... ప్రారంభించనున్న బీజేపీ

ఏప్రిల్ 20 నుంచి వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా క్యాంపెయిన్... ప్రారంభించనున్న బీజేపీ

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) చట్టంపై దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ముస్లింలకు కలిగే ప్రయోజనాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి పదిహేను రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. 

గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ఆఫీస్​ బేరర్ల వర్క్​షాప్​లో వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సవరించిన వక్ఫ్ చట్టంలోని నిబంధనలపై ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నాయని నడ్డా ఆరోపించారు.