యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయ ప్రసాదాల తయారీలో నాణ్యత పాటించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నేతలతో కలిసి కొండపైన ఆలయ ఈవో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వామివారి ప్రసాదంలో గతంలో బొద్దింక, ఇనుప చూరలు, రీసెంట్‌గా ఎలుక రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా క్వాలిటీ
నీట్ నెస్ మెయింటేన్ చేయాలని కోరారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాద సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ఈవో రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్
జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య మండల ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి, మండల అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, నేతలు బందారపు మల్లేశం, చిత్తర్ల కృష్ణ, దొమ్మాట ప్రభాకర్, నల్ల వాసురెడ్డి, లెంకలపల్లి శ్రీనివాస్, గుండ్లపల్లి మధు, రాఘవుల సాయికిరణ్, శివరాత్రి శ్రీశైలం పాల్గొన్నారు.