కులగణనను బీజేపీ పక్కదారి పట్టిస్తోంది

కులగణనను  బీజేపీ పక్కదారి పట్టిస్తోంది
  • బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్
  • అందుకే రాహుల్ పై విమర్శలు చేస్తున్నారు

హైదరాబాద్, వెలుగు: కులగణన అంశాన్ని పట్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందుకే తమ ఎంపీ రాహుల్  గాంధీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. గత 11 ఏండ్లలో దేశం కోసం, పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని సోమవారం ఒక ప్రకటనలో ఆమె విమర్శించారు. 

విభజన రాజకీయాలు చేసి పదవులు పొందడం బీజేపీ నేతల నైజమన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్  గాంధీ ఉద్దేశమని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని, అందుకు కులగణన నిర్వహించాలని రాహుల్  డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్.. విజన్ ఉన్న నేత అని, ఎలాంటి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. అదానీ ఆస్తుల పెంచడానికి ఆయన పనిచేయడం లేదన్నారు. 

ఫిబ్రవరి 18న  ఉదయ్ పూర్ కు మంత్రి సీతక్క

కేంద్ర జ‌‌లశ‌‌క్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో  వాటర్ విజన్ 2047 సదస్సులో పాల్గొనేందుకు మంత్రి సీతక్క మంగళవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు వెళ్లనున్నారు. తెలంగాణ‌‌లో అమ‌‌లవుతున్న గ్రామీణ మంచి నీటి స‌‌ర‌‌ఫ‌‌రా వ్యవ‌‌స్థపై సీత‌‌క్క ఆ సదస్సులో మాట్లాడనున్నారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వ‌‌చ్చిన త‌‌ర్వాత చేప‌‌ట్టిన చ‌‌ర్యల‌‌ను కేంద్రం, ఇత‌‌ర రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే, ఇంటింటికి  ర‌‌క్షిత మంచి నీటిని అందించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి కోరనున్నారు.