కేంద్రం ముందు కేరళ ప్రజలు తలవంచరు

కేంద్రం ముందు కేరళ ప్రజలు తలవంచరు

తిరువనంతపురం: రాష్ట్రాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. సెంట్రల్ ఏజెన్సీలతో దాడులు చేయిస్తూ స్టేట్ సర్కార్‌‌లను ప్రభుత్వం భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. ‘కేరళలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. సెంట్రల్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ఈ పనిని చేయిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీతో దోస్తీ చేస్తోంది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేఐఐఎఫ్‌‌బీపై వేసిన కేసు విషయంలో ఇరు పార్టీల నేతలు కోర్టులో కలసి కనిపించడమే ఇందుకు నిదదర్శనం. ఇలాంటి కేరళ వ్యతరేక శక్తులకు ప్రజలు తలవంచబోరు’ అని విజయన్ స్పష్టం చేశారు. కేరళ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్‌‌బీ) అధికారులపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫెమా కేసులు పెట్టిన నేపథ్యంలో విజయన్ పైవ్యాఖ్యలు చేశారు.