మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘‘ఆ ఒక్కటి అడక్కు’’ అని వ్యంగ్యంగా రూపొందించిన పోస్టర్లను మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఆవిష్కరించారు. ఈ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.
పోస్టర్లలోని అంశాలు...
చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్, ఆకుపచ్చ మునుగోడు, రైతులకు ఉచిత ఎరువులు, రైతులకు రూ.లక్ష రుణమాఫీ, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీలకు ప్రతి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు, దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనులు, కొత్త ఆసరా ఫించన్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, గ్రామ పంచాయతీకి 20 లక్షలు తదితర హామీలను పోస్టర్ లో పేర్కొన్నారు.