డోర్నకల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ విజయం ఖాయం: వద్దిరాజు రామచంద్రరావు

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : డోర్నకల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాదంతాలపల్లి మండలంలోని పలు గ్రామాలకు యువత గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలు  బీఆర్ఎస్ పాలనపై విసుగుచెంది, ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలం అయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేశ్‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్, నాయకులు బానోత్ ప్రభాస్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, దాసరి మురళి పాల్గొన్నారు.