ఎమ్మెల్యే అరూరిపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే అరూరిపై చర్యలు తీసుకోవాలి

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు : ఓటర్లను ఆకట్టుకునేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌ బహుమతులు పంచుతున్నారని బీజేపీ వరంగల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌‌‌‌  ఆరోపించారు. ఆదివారం స్థానికంగా మాట్లాడుతూ ఓడిపోతానన్న భయంతోనే ఎమ్మెల్యే అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యం గార్డెన్స్‌‌‌‌లో బూత్‌‌‌‌ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా మాజీ ఎంపీ చాడ సురేశ్‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌‌‌‌రావు, ధర్మారావు, శ్రీరాములు  హాజరవుతారన్నారు. సమావేశంలో రాజేంద్రప్రసాద్, ముత్తిరెడ్డి కేశవరెడ్డి, బన్న ప్రభాకర్, బొల్లపల్లి మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ పాల్గొన్నారు.