
- అప్రతిహత గెలుపులు
కేవలం రెండు లోక్సభ సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనే శక్తిమంతమైన రాజకీయ పార్టీల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుస్థిరంగా, సురక్షితంగా ఉండడం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.
బీజేపి ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి భారతీయ రాజకీయాల్లో మరో కీలక ఘట్టాన్ని లిఖించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కేవలం ఒక రాష్ట్ర రాజకీయ పరిణామంగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా బీజేపీ మరోసారి పుంజుకుంటున్న సంకేతంగా చూడాలి. 2014లో లోక్సభ ఎన్నికలతో మొదలైన బీజేపీ ప్రభ నరేంద్ర మోదీ నాయకత్వంలో అప్రతిహతంగా కొనసాగుతోంది.
గత పదేళ్ల కాలంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలుపొందింది. యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన బీజేపీ, గోవా లాంటి చిన్న రాష్టంలోనూ ఘన విజయం సాధించింది. తాజా ఢిల్లీ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల సంఖ్య పెరిగింది.
ఇప్పుడు బీజేపీ తనదైన పాలనా విధానాలతో 19 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉంది. కేవలం హిందీ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఈశాన్య భారతదేశంలోనూ బీజేపీ బలపడి, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించడాన్ని, మోదీ పరిపాలను, బీజేపీ విధానాలకు దక్కిన పెద్ద రాజకీయ విజయంగా పేర్కొనవచ్చు.
మోదీకి ...ట్రంప్ గౌరవం
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో, ప్రపంచం ఆశ్చర్యపడేవిధంగా మోదీకి గౌరవం దక్కింది. వైట్ హౌస్లో ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి జరిపి భారత ప్రధానికి ఎన్నడూ లేనంత గౌరవాన్ని ఇచ్చారు. అంతేకాదు ప్రధాని మోదీ చొరవతో, భారత్‌కు అధునాతన రక్షణ సాంకేతికత అందించేందుకు అమెరికా అంగీకరించడం భారత రక్షణ వ్యవస్థలో గొప్ప మైలురాయి.
దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం
కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్రాంతీయ పార్టీల అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో విసిగిపోయారు. దేశ ప్రయోజనాలే ముఖ్యం అన్న బీజేపీ సిద్ధాంతంతో, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ చేసిన పోరాటాన్ని ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ప్రజలు సుపరిపాలన, సుస్థిర పాలనను, సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారు. అందువల్లే ఎక్కడైనా బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధికి అవధులు ఉండవు. అందుకు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనం. అందులో దేశమంతా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనతో బేజారైన ప్రజలు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ఎదురుచూస్తున్నారు.బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాల వల్ల, తన సిద్ధాంత బలం వల్ల గతంలో ప్రాభల్యం లేని ప్రాంతాల్లోకి, రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోతున్నది.
ఒడిశా, త్రిపుర, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే పాదం మోపింది.ఈ రాష్ట్రాల్లోనూ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీకి ప్రజల మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీతో రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్మాయంగా రూపొందింది. 2028 లో జరిగే ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వనుందని సెఫాలజిస్టులు, రాజకీయ పండితులూ చెప్తున్నారు.
- బొమ్మ శరత్ గౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేవైయం, తెలంగాణ–