తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే: దినేశ్​కులాచారి

డిచ్​పల్లి, వెలుగు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిజామాబాద్​ రూరల్​ఇన్​చార్జ్​ దినేశ్​కులాచారి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ గెలుపునకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

మండలంలోని సుద్దపల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కులాచారి సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకటరమణ, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ సతీష్​ రెడ్డి, సంతోషం, గంగారం, ఆనందమ్మ, చంద్రకాంత్, సుదర్శన్​రెడ్డి, భూమన్న, సాయిలు, విఠల్ రెడ్డి పాల్గొన్నారు.