మునుగోడులో బీజేపీ సభ చీఫ్ గెస్టుగా యూపీ సీఎం యోగి!

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 లేదా 29న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 30 న సీఎం కేసీఆర్ సభ ఉండడంతో.. అంతకు ముందే సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి చీఫ్ గెస్ట్​గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను ఆహ్వానించాలని ప్లాన్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ఇయ్యాల్టి నుంచి జోరుగా ప్రచారం

మునుగోడులో పార్టీ ప్రచారాన్ని బీజేపీ శనివారం నుంచే స్పీడప్ చేయనుంది. నియోజకవర్గంలోని ఒక్కో  మండలంలో ఒక్కో రాష్ట్ర నేత పర్యటించేలా ఇదివరకే షెడ్యూల్ ఖరారు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్​,  ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ మంత్రి బాబు మోహన్ శని, ఆదివారాల్లో వారికి కేటాయించిన మండలంలో ప్రచారం చేయనున్నారు.