యూపీలో 300 సీట్లు గెలుస్తాం 

లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి అన్నాచెల్లెలు చాలని.. ఇంకెవరూ అవసరం లేదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశించి యోగి పైవ్యాఖ్య చేశారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి యోగి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యూపీలో తమ పార్టీ 300 సీట్లు గెలుస్తుందన్నారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

‘యూపీలో 80 శాతం ప్రజలు మా పనితీరుపై సంతోషంగా ఉన్నారు. వారి ఓట్లు మాకే పడతాయి. ఎన్నికల్లో 80 వర్సెస్ 20గా పోరు ఉండబోతోంది. ప్రత్యర్థి పార్టీలకు ఇరవై శాతానికి మించి ఓట్లు రావడం కష్టమే. యూపీలో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ను ముంచడానికి ఇతరుల అవసరం లేదు. అన్నాచెల్లెలు (ప్రియాంక, రాహుల్) ఇద్దరే చాలు’ అని యోగి చెప్పారు. ఆజం ఖాన్ జైలు నుంచి రావొద్దని అఖిలేశ్ యాదవ్ కోరుకుంటున్నారని యోగి పేర్కొన్నారు. ఖాన్ బయటికి వస్తే తన పదవి (సమాజ్ వాదీ పార్టీ చీఫ్ )కి హాని కలుగుతుందనే అఖిలేశ్ భావిస్తున్నారని అన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

భర్త నుంచి విడిపోయిన మరో నటి

శ్రీవారి భక్తులకు శుభవార్త

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు