ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది: రావుల రాంనాథ్

కడెం, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఈ విషయాన్ని అన్ని సర్వేలు చెబుతున్నాయని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ రావుల రాంనాథ్ తెలిపారు. అదివారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్​లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరగగా రాంనాథ్​ చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అమలుకు వీలుకాని హామీలను ప్రకటిస్తున్నాయని మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదని బీఅర్ఎస్ మంత్రులు చెప్పడం దారుణమన్నారు. గ్రామీణ స్థాయి నుంచి బీజేపీ బలంగా ఉందని గమనించి బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తన్నారని ఫైర్​ అయ్యారు. ఈ నెల 10న అదిలాబాద్​కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని.. ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూక్య జానుబాయ్, రాష్ట్ర నాయకుడు రితీశ్ రాథోడ్, అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్, నాయకులు టేకు ప్రకాశ్, గడ్డం రవీందర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.