తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని .. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో జరిగిన ధర్మపురి నియోజకర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వచ్చే 50 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, బూత్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.
తెలంగాణ లో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉందన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.