
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8 ఎంపీస్థానాల్లోనే బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో కమలం అభ్యర్థులు భారీ మెజార్టీల దిశగా అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మహబూబ్ నగర్ లో నువ్వా.. నేనా అన్నట్టుగా ఫలితాలు మారుతున్నాయి. ఏది ఏమైనా ఎనిమిది సంఖ్య తెలంగాణలో బీజేపీకి బాగా అచ్చొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.