
- ఓటరు లిస్ట్ సవరించకపోతే ఈసీ ముందు ధర్నా చేస్తం: మమతా బెనర్జీ
కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ.. నకిలీ ఓటర్లతో రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలనే ఉపయోగించిందని.. పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె పేర్కొంది. ఎన్నికలు న్యాయంగా జరిగితే గెలవలేమని వారికి తెలుసని అన్నారు.
ఢిల్లీ, మహారాష్ట్రలో హర్యానా, గుజరాత్ నుంచి నకిలీ ఓటర్లను తీసుకొచ్చి బీజేపీ విజయం సాధించిందని ఆమె అన్నారు. ఎన్నికల సంఘం మద్దతుతోనే ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తీసుకొచ్చి అక్కడి జాబితాలో చేర్చారని ఆమె ఆరోపించారు. గురువారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఎంసీ రాష్ట్ర సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈసీపై బీజేపీ ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోకపోతే, తన పార్టీ ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తుందని మమత హెచ్చరించారు.