- మా ప్రభుత్వానికి ఢోకా లేదు
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తమ ప్రభుత్వానికి ఢోకా లేదని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ తాత, ముత్తాతలు దిగి వచ్చిన తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. గురువారం సీఎల్పీలో మీడియాలో ఆయన మాట్లాడారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారని, కాశ్మీర్ ఫలితంపై సైలెంట్ అయ్యారని చెప్పారు. హర్యానా ఓటమి రాహుల్ గాంధీ వల్లే అని కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, వాళ్ల విమర్శలు ఎవరూ పట్టించుకోరని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పార్టీ ఈవెంట్లాగా మార్చిందని విమర్శించారు. పదేండ్లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత ఇప్పుడెక్కడని ప్రశ్నించారు.