ఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్కు ఓటెయ్యరు

మునుగోడులో బీజేపీ గెలిస్తే..ఆ తర్వాత నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యావత్ దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని.. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టేది లేదని చెప్పారు. టీఆర్ఎస్లో చేరితేనే ఎమ్మెల్యేలకు కేసీఅర్ అపాయిట్మెంట్ ఇస్తాడన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గ సమస్యల గురించి కేసీఅర్ను అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇంటికో కిలో బంగారం ఇచ్చినా..టీఆర్ఎస్కు ప్రజలు ఓటెయ్యరని చెప్పారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు.