![యూపీ మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు.. 62 వేల ఓట్ల మెజార్టీ](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-wins-in-up-milkipur-by-election-with-a-majority-of-62-thousand-votes_5jPoYzlhVB.jpg)
అయోధ్య (యూపీ): మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 61,710 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు1.46 లక్షకు పైగా ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి అజిత్ ప్రసాద్‌కు 84,687 ఓట్లు వచ్చాయి. గతంలో ఫైజాబాద్ నుంచి ఎస్పీ ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందారు.
దీంతో మిల్కిపూర్‌లో ఉప ఎన్నికఅనివార్యమైంది. ఈ స్థానంలో బీజేపీ పాసీ సామాజిక వర్గానికి చెందిన పాశ్వాన్‌ను నిలబెట్టగా, ఎస్పీ నుంచి ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్ బరిలో నిలిచారు. రామాలయం ఫైజాబాద్ లోనే ఉంది. యూపీలో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ కోల్పోయిన ఏకైక సీటు మిల్కిపూర్. అందువల్ల ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ గట్టిగా కృషి చేసింది.