ఆ ఎస్సై పింక్ డ్రెస్ వేసుకుంటాడా?.. ప్రశ్నించిన యువతి

ఆ ఎస్సై పింక్ డ్రెస్ వేసుకుంటాడా?.. ప్రశ్నించిన యువతి

ఎన్నిక తీరును పరిశీలించడానికి హిమ్మత్ నగర్ వెళ్లిన బీజేపీ నాయకురాలు తుల ఉమను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలీసులు కూడా బీజేపీ కార్యకర్తలను మాత్రమే దూరంగా పంపిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసులు టీఆర్ఎస్ బట్టలు వేసుకొని ప్రచారం చేయండని ఓ వృద్దుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

డ్యూటికొచ్చిన ఎస్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలను ఏమీ అనకుండా బీజేపీ వాళ్లను తరుముతున్నాడని బీజేపీకి చెందిన ఓ యువతి మండిపడింది. ఆ ఎస్ఐ ఖాకీ డ్రెస్ ఇప్పేసి పింక్ డ్రెస్ వేసుకుంటాడా అని ప్రశ్నించింది. టీఆర్ఎస్ వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా అని ప్రశ్నించింది. మా కార్యకర్తల మీద టీఆర్ఎస్ వాళ్లు చేయి చేసుకున్నారని.. వాళ్ల మీద పోలీసులు చర్య తీసుకోకపోతే.. ఎస్ఐ సార్ కి మేమే పింక్ డ్రెస్ తొడిగిస్తామని చెప్పుకొచ్చింది.