బీజేపీ లీడర్ దారుణ హత్య.. నాటుకొడవళ్లు, బాంబులతో వెంటపడి చంపేశారు

తమిళనాడులో బీజేపీ ముఖ్య నేత శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నాటుకొడవళ్లు, బాంబులతో వెంటపడి చంపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. సాయంత్రం చెన్నై నుంచి ఇంటికి వెళ్తున్న టైమ్ లో శంకర్ పై దుండగలు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. 

స్పాట్ లోనే శంకర్ చనిపోయినట్లుగా సమాచారం.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టపక్కల ఉన్న సీసీటీవీ పుటేజ్  ను పరిశీలిస్తున్నారు.   శంకర్ తమిళనాడు బీజేపీకి ఎస్టీ, ఎస్సీ వింగ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. హత్య చేసిన ముఠా ఎవరనే కోణంలో విచారణ కొనసాగుతోంది.