కొండపాకలో పంచాయతీ సిబ్బందిపై బీజేపీ కార్యకర్తల దాడి

కొండపాకలో పంచాయతీ సిబ్బందిపై బీజేపీ కార్యకర్తల దాడి
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు  
  • విచారణ చేపట్టిన గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి

కొండపాక, వెలుగు : గ్రామపంచాయతీ సిబ్బందిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన మండల కేంద్రం కొండపాకలో మంగళవారం సాయంత్రం జరిగింది. కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గజ్జె నర్సింహులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎదుట ఉన్న  ఫ్లెక్సీలను తొలగిస్తున్నాడు. బీజేపీ నాయకుడికి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగిస్తావా..

 అంటూ ఆ పార్టీ  కార్యకర్త చెన్న హరికిషన్, శ్రీరామ్, మధు దుర్భాషలాడుతూ పంచాయతీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.  బాధితులు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,  గురువారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తొగుట సీఐ లతీఫ్,  కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ విచారణ చేపట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 

వారు పేర్కొన్నారు.