అధ్యక్షుల మార్పుపై బీజేపీ ఆఫీసులో కార్యకర్తల ధర్నా

హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్ ఏకపక్షంగా13మండలాల అధ్యక్షులను మార్చారంటూ కార్యకర్తలు ధర్నా చేశారు. 

ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ఆఫీస్ లో ధర్నా చేయొద్దు అంటూ చెప్పేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డితో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

ALSO READ :పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై పొన్నం ప్రభాకర్ క్లారిటీ