- తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తాం
- బీజేపీ జాతీయ నేత బండి సంజయ్
చౌటుప్పల్, వెలుగు : బీఆర్ఎస్ను కూకటివేళ్లతో కూల్చివేయాలన్న కోపంతో ప్రజలున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం వెళ్తున్న ఆయనకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో చూడబోతున్నామన్నారు.
బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారన్నారు. గులాబీ పార్టీని కూకటివేళ్లతో కూల్చివేయాలన్న కోపం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తోందన్నారు. అధికారం ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేయకుండాఅతి తక్కువ కాలంలోనే ప్రజల కోపానికి గురైన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగొని శంకర్, మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం, మున్సిపల్అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి , ఆలె చిరంజీవి, పోలోజు శ్రీధర్ బాబు, కాయితి రమేశ్ ఉన్నారు.