సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత కాకా వెంకటస్వామిదే

సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత కాకా వెంకటస్వామిదే

కాకా వెంకటస్వామి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణిలో లక్ష మంది కార్మికులు ఉన్నారని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్ ALP మైన్ లో నిర్వహించిన బీఏంఎస్ యూనియన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల కోసం కాకా వెంకటస్వామి పోరాడరని గుర్తు చేశారు. BIFR లిస్ట్ లో చేరి సింగరేణి సంస్థ మూత పడుతుందన్న సమయంలో ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి, లక్ష మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడారని చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ నియమాకాలు వస్తాయని తెలంగాణ ఉద్యమం చేసి, రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో 63వేల మంది కార్మికులు ఉంటే ప్రస్తుతం 43 వేల ఉద్యోగులు మాత్రమే ఉన్నారని అన్నారు.  

మరిన్ని వార్తల కోసం..

నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు

శ్రీలంకకు కొత్త ప్రధాని