బీజేపీ సంస్థాగతఎన్నికల ప్రక్రియ షురూ

బీజేపీ సంస్థాగతఎన్నికల ప్రక్రియ షురూ
  • 30న మండల కమిటీ ఎన్నికపై వర్క్ షాప్

హైదరాబాద్, వెలుగు : బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో సోమవారం బూత్ కమిటీల ఎన్నికలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడ బూత్ కమిటీలకు సరిపడ మెంబర్ షిప్​ అయిందో అక్కడ కమిటీలు వేసుకోవచ్చని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల30న బీజేపీ మండల కమిటీల ఎన్నికలపై వర్క్ షాప్​ నిర్వహించనున్నారు. 

స్టేట్ ఆఫీసులో జరిగే సమావేశానికి ముఖ్య​అతిథులుగా బీజేపీ ఇన్ చార్జీలు అభయ్ పటేల్, సునీల్ బన్సల్ అటెండ్ కానున్నారు. ఈ సందర్భంగా బూత్ కమిటీల ఏర్పాటుతో పాటు మండల కమిటీల ఎన్నికలపై నేతలకు సూచనలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షలకు పైగా మెంబర్ షిప్ పూర్తయినట్టు నేతలు చెప్తున్నారు. దీనిలో రెండు లక్షల సభ్యత్వంతో కరీంనగర్​ జిల్లా టాప్ లో ఉండగా, ములుగు, భూపాలపల్లి చివరి స్థానంలో నిలిచినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు.