జనసేనకు 6 సీట్లు కన్ఫామ్.. మరో రెండు సీట్లు పెండింగ్​లో పెట్టిన బీజేపీ

  • జనసేనకు  6 సీట్లు కన్ఫామ్
  • మరో రెండు సీట్లు పెండింగ్​లో పెట్టిన బీజేపీ
  • శేరిలింగంపల్లి ఇచ్చేదిలేదని స్పష్టీకరణ

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. జనసేన తొమ్మిది సీట్లకు పట్టుబడుతుండగా.. ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అందులో ఆరు సీట్లు ఏవనేది వెల్లడించింది. శేరిలింగంపల్లి సీటును ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది.  మల్కాజ్​గిరి, తాండూర్  సీట్లు కూడా కావాలని జనసేన అడుగుతుండగా.. వీటిపై నిర్ణయాన్ని బీజేపీ పెండింగ్​లో పెట్టింది. జనసేన చీఫ్​ పవన్​ కల్యాణ్​ ఇంటికి ఆదివారం రెండుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి, ఎంపీ లక్ష్మణ్​ వెళ్లి చర్చించారు.   

ALSO READ : నన్ను కొనే శక్తి ఎవరికీ లేదు : కోమటిరెడ్డి రాజగోపా

జనసేనాకు ఖరారైనఆరు సీట్లు ఇవే : 

కూకట్ పల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వైరా, కొత్తగూడెం, నాగర్ కర్నూల్.