అవినీతి సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలి.. బీజేపీ నేత గౌరవ్ భాటియా

అవినీతి సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలి.. బీజేపీ నేత గౌరవ్ భాటియా

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన కొద్దిసేపటికే.. బీజేపీ నేతలు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ క నైతికత ఉంటే వెంటనే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అధికారి ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎం తక్షణమే రాజీనామా చేయాలి.. లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ ను బెయిల్ పై సీఎం అని పిలుస్తారు అని అన్నారు. 

అరవింద్ కేజ్రీవాల్ అలా చేయడు..ఎందుకంటే అతనిలో నైతికత కూడా లేదు. అరవింద్ కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించినా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు. అవినీతి పరుడు, అధికారంలో కొనసాగుతున్నాడు.. అని చెప్పడం తప్పుకాదు అని గౌరవ్ అన్నారు. 

ఆప్ నేత కేజ్రీవాల్ బెయిల్ పై రావడంపై మరోబీజేపీ నేత, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును జాగ్రత్తగా చదవాలి.. కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా చట్టబద్దమైనదిని కోర్టు స్పష్టంగా చెప్పింది.. ఎక్సైజ్ పాలసీ స్కాం అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. 

Also Read :- కేజ్రీవాల్ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది