Maharashtra Results : 85 శాతం స్ట్రయిక్ రేటుతో బీజేపీ విక్టరీ.. ఆ వెనకే శివసేన, ఎన్సీపీ

Maharashtra Results : 85 శాతం స్ట్రయిక్ రేటుతో బీజేపీ విక్టరీ.. ఆ వెనకే శివసేన, ఎన్సీపీ

మహారాష్ట్రలో బీజేపీ గ్రాండ్ విక్టరీ.. మరోసారి అధికారం చేపట్టబోతోంది. మునుపెన్నడూ లేనంతగా మహారాష్ట్ర ఓటర్లను ఆకట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని మహా యూతి కూటమి..మహా అసెంబ్లీ ఎలక్షన్లలో అత్యధిక స్థానాల్లో తిరుగు లేని విజయాన్ని అందుకుంది. ఈ విక్టరీతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలో రానుంది. 

అయితే ఈ ఎన్నికల్లో బీజేపీదే హవా..మహాయుతి కూటమిలో కీలకమైన బీజేపీ పోటీ చేసిన అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 85.5శాతం స్ట్రయిక్ రేటుతో 127 సీట్లను సాధించింది.  

బీజేపీ పోటీ చేసిన 145 స్థానాలకు గాను 127 స్థానాల్లో గెలుపొందింది. మహాయుతి కూటమిలోని శివసేన షిండే పార్టీ వర్గం 81 సీట్లలో పోటీ చేయగా 55 స్థానాలను దక్కించుకుంది. 70శాతం స్ట్రయిక్ రేటుతో శివసేన పార్టీ సత్తా చాటింది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 59 స్థానాల్లో పోటీ చేయగా.. 37 స్థానాల్లో 63 శాతం స్ట్రయిట్ రేటుతో విజయం సాధించింది.