- 31న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ
- హాజరుకానున్న జేపీ నడ్డా
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. 31న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అధిష్టానం మంగళవారం ప్రకటించింది. ముఖ్య అతిథిగా నడ్డా హాజరవుతున్నారని వెల్లడించింది.
ఇయ్యాల బీజేపీ మేనిఫెస్టో
మునుగోడు బై ఎలక్షన్ కోసం బుధవారం బీజేపీ మేనిఫెస్టో ప్రకటించనుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు క్యాంప్ ఆఫీస్ దగ్గర సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.