Delhi Results: ప్రియాంకపై వివాదాస్పద వాఖ్యలు చేసిన బీజేపీ నేత ముందంజ

Delhi Results: ప్రియాంకపై వివాదాస్పద వాఖ్యలు చేసిన బీజేపీ నేత ముందంజ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. దేశ రాజధానిని కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నించిన ఆప్ ఎర్లీ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. 
అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. 

కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిపిస్తే కల్కాజీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తాను’’ అని వివాదాస్ప వ్యాఖ్యులు చేసిన రమేష్ బిదూరి లీడ్ లో కొనసాగుతున్నారు. ఆప్ అభ్యర్థి, ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం అతిశీ వెనుకంజలో కొనసాగుతున్నారు. 2020లో అతిశీ 52.28 శాతం ఓట్లతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచింది. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత సీఎం పదవిని చేపట్టిన అతిశీ.. ట్రెండ్స్ లో వెనకంజలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా మూడో స్థానంలో కొనసాగుతోంది.