న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాను ఎప్పుడూ భయపడనని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. చెరుకు మద్దతు ధర పెంపు అంశాన్ని తానే ముందుగా లేవనెత్తానని.. ఆ సమయంలో ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం నోరు మెదపలేదన్నారు. వారికి అంత ధైర్యం లేదన్నారు. ఎలక్షన్ టిక్కెట్లు ఇవ్వరేమోనని వారు భయపడతారని, కానీ తాను అలాంటి రకం కాదన్నారు. బరేలీ నియోజకవర్గంలో రెండ్రోజుల టూర్ లో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడానికి ఎప్పుడూ భయపడొద్దని వరుణ్ చెప్పారు.
‘పార్టీ టిక్కెట్ ఇవ్వదేమోనని కొందరు నేతలు భయపడతారు. ప్రజల సమస్యల గురించి ప్రజాప్రతినిధులే మాట్లాడకుంటే ఎలా? మరి ప్రజాగొంతును ఎవరు వినిపిస్తారు? నాకు మాత్రం జనాల సమస్యలే ముఖ్యం. టిక్కెట్ రాకపోయినా పట్టించుకోను. మా అమ్మ ఎలక్షన్లలో స్వతంత్ర్యంగా నిలబడి గెలిచింది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. నేను విప్లవకారుడ్ని.. నిజాలు మాత్రమే చెబుతా. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను’ అని వరుణ్ స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం: