మీ గెలుపుతో రాష్ట్ర బీజేపీ కేడర్​లో జోష్ :  సునీల్ బన్సల్

మీ గెలుపుతో రాష్ట్ర బీజేపీ కేడర్​లో జోష్ :  సునీల్ బన్సల్
  • ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకు సునీల్ బన్సల్ అభినందనలు

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ –  నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన మల్క కొమరయ్యను బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్​చార్జీ సునీల్ బన్సల్ అభినందించారు. శనివారం హైదరాబాద్ లోని కొమరయ్య ఇంటికి వెళ్లి ఆయనను సన్మానించారు. ఆయన గెలుపుతో బీజేపీ కేడర్​లో మరింత జోష్ వచ్చిందని చెప్పారు.

టికెట్ ఇచ్చిన తక్కువ సమయంలోనే.. అందరినీ కలుపుకొని విజయం సాధించడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల వివాహం జరిగిన కొమరయ్య కొడుకు బీజేవైఎం రాష్ట్ర నాయకుడు మల్క యశస్వీ, ప్రకృతి దంపతులకు  సునీల్ బన్సల్ శుభాకాంక్షలు తెలిపారు.