పిట్లం, వెలుగు : రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం జిల్లా సెక్రెటరీ శెట్టిపల్లి విష్ణు డిమాండ్ చేశారు. మంగళవారం బిచ్కుంద తహసీల్ ఆఫీసులో స్థానిక నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నియామకాల్లో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేవైఎం బిచ్కుంద అధ్యక్షుడు బుగుడాల బాల్‌రాజ్, నాయకులు లక్ష్మ ణ్చారి, సంతోష్, ధన్నూర్ విఠల్, హన్మాండ్లు, మోహన్, బాలు తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్, వెలుగు : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సదాశివనగర్ తహసీల్దార్ గంగసాగర్ కు బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దొడ్ల కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా బీజేవైఏం మెంబర్ ప్రేమ్‌కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్ల వంశీ మండల నాయకులు పాల్గొన్నారు.
లింగంపేట, వెలుగు : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ మంగళవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ నరేందర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు మార్గం రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి రవి, నాయకులు వంశీకృష్ణ, సుభాష్, రాజు, ప్రవీణ్, రంజిత్, రాకేశ్, సంతోష్, శివ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.