డీజీపీ ఆఫీసు ముట్టడి.. బీజేవైఎం నేతలకు గాయాలు

డీజీపీ ఆఫీసు ముట్టడి.. బీజేవైఎం నేతలకు గాయాలు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ కు గాయాలయ్యాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలిపి న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముట్టడికి వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు తీసుకుని స్టేషన్ కు తరలించారు.