కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేవైఎం స్టేట్​ ప్రెసిడెంట్​ మహేందర్ ​

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేవైఎం స్టేట్​ ప్రెసిడెంట్​ మహేందర్ ​

కామారెడ్డి టౌన్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం స్టేట్​ ప్రెసిడెంట్​ సెవెళ్ల మహేందర్ సూచించారు.  బుధవారం  కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల   సన్నాహాక మీటింగ్​ జరిగింది.  స్టేట్​ప్రెసిడెంట్​ మాట్లాడుతూ..  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి  చేయాలన్నారు.

యువత,  విద్యావేత్తలు, మేధావులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు.  స్థానిక సంస్థల్లో సత్తా చాటాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ నీలం చిన్న రాజులు,  ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​చార్జి జయశ్రీ,  బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ వేణు, లీడర్లు  ప్రభాకర్​, రాజేశ్, భరత్​, మనోజ్​, కళ్యాణ్​, సతీశ్​, సాయి, నవీన్​, రాజ్​గోపాల్​ పాల్గొన్నారు.