Farmer Protest: పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పోలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ ఛలో ఆందోళలను రైతులు ఉదృతం చేస్తున్నారు. ఓవైపు రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు పంజాబ్ లో గురు వారం (ఫిబ్రవరి 15) పంజాబ్ లో రైతులు రైల్వే ట్రాక్ లను దిగ్బంధించి సంఘీభావం తెలుపుతారని భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహన్ ప్రకటించింది.
చర్చలకు సిద్ధం: జగ్జీత్ సింగ్ దల్వాల్
మరోవైపు కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రకటించారు. కనీస మద్దతు ధర చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లపై కేంద్రంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్ బుధవారం ప్రకటించారు. కేంద్రం తమతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారని జగ్జీత్ సింగ్ దల్వాల్ చెప్పారు. చర్చలకోసం తోటి రైతులు అంగీకారం తీసుకున్నామని అన్నారు. అయితే చర్చలు చండీగడ్ లో జరగాలన్నది మా డిమాండ్ అన్నారు. వీటన్నింటికి కేంద్రం ఆహ్వానం ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని చెబితే మేం చర్చలకు సిద్ధమని జగ్జీత్ సింగ్ దల్వాల్ చెప్పారు.
VIDEO | Police resort to tear gas shelling after stone pelting by protesting farmers at Punjab-Haryana Shambhu Border. pic.twitter.com/aQDbWwJdoh
— Press Trust of India (@PTI_News) February 14, 2024