బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శ 

హుజూర్ నగర్, వెలుగు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బురుగడ్డ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్ దేశ్​ముఖ్ ను మంగళవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పరామర్శించారు. అరుణ్ కుమార్ మాతృమూర్తి దేశముఖ్ నాగలక్ష్మి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుత్తా, కోదాడ ఎమ్మెల్యే బూరుగడ్డ లోని అరుణ్ కుమార్​నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరార్శించారు. అనంతరం నాగలక్ష్మి పొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి వెంట పీసీసీ సభ్యుడు ఈడుపుగంటి సుబ్బారావు, డీసీఏంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామి రెడ్డి, ఐఎన్​టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ , నాయకులు ఉన్నారు.